Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్ ఆ పని చేస్తే, కాల్చే బులెట్ల లెక్క కూడా చూసుకోం: రాజ్ నాథ్ హెచ్చరిక

సరిహద్దుల్లో నిత్యమూ ఉద్రిక్తతలకు కారణమవుతున్న పాకిస్థాన్ వైఖరిపై హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు. ఇండియా ఎన్నడూ పాకిస్థాన్ పై తొలి బులెట్ ను కాల్చదని స్పష్టం చేసిన ఆయన, పాక్ నుంచి ఒక్క బులెట్ వచ్చినా, ఇండియా అందుకు తగ్గ సమాధానం చెబుతుందని హెచ్చరించారు. కాల్చే బులెట్ల సంఖ్యను కూడా లెక్కించకుండా విరుచుకుపడతామని అన్నారు. ఉత్తరాఖండ్ లోని ఖతిమాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, జేఎన్యూలో జరిగిన ఘటనలనూ ప్రస్తావించారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసేది ఎవరైనా ఉపేక్షించేది లేదని అన్నారు. తమపై చేసే ఎలాంటి వ్యాఖ్యలనైనా సహిస్తామని, భారతావనికి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం సహించమని ఆయన అన్నారు.

More Telugu News